Movie: Chakram Music: Chakri
Lyrics: Sirivennela Seetarama Sastri Singer: Sri Director: Krishna
Vamsee
జగమంత కుటుంబం నాది యేకాకి
జీవితం నాది
జగమంత కుటుంబం నాది యేకాకి
జీవితం నాది
సంసార సాగరం నాదె సన్యాసం
శూన్యం నావే
జగమంత కుటుంబం నాది యేకాకి
జీవితం నాది
కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాలొ కన్నీటి
జలపాతాల
నాతో నేను అనుగమిస్తు నాతో
నేనె రమిస్తూ
వంటరినై అనవరతం కంటున్నాను
నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని
రంగుల్నీ రంగవల్లులనీ కావ్య
కన్యల్ని ఆడ పిల్లలని
జగమంత కుటుంబం నాది యేకాకి
జీవితం నాది
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిసినై
నాతో నేను సహగమిస్తూ నాతో
నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిమిషం కంటున్నాను
నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని
హరిణాల చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని
ఇంద్ర జాలాన్ని
జగమంత కుటుంబం నాది యేకాకి
జీవితం నాది
జగమంత కుటుంబం నాది యేకాకి
జీవితం నాది
గాలి పల్లకీలోన తరలి నా పాట
పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి
తను మూగబోయి నా గుండె మిగిలె
నా హ్రుదయమే నా లోగిలి
నా హ్రుదయమే నా పాటకి తల్లి
నా హ్రుదయమే నాకు ఆలి
నా హ్రుదయములో ఇది సినీవాలి
జగమంత కుటుంబం నాది యేకాకి
జీవితం నాది
జగమంత కుటుంబం నాది యేకాకి
జీవితం నాది