Wednesday, January 30, 2013

Kotha Bangaru Lolkam telugu song lyrics in telugu font nenanee neevanee



Movie: Kotha Bangaru Lokam Music: Micky J Meyer Lyrics: Sirivennela Seetarama Sastri Singer: Swetha Pandit Director: Srikanth Addala

నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ
ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్ప వెనకాలా స్వప్నం
ఎప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలరా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే

మొదటి సారి మదిని చేరి
నిదర లేపిన ఉదయమా
వయసులోని పసితనాన్ని
పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా మరో పుట్టుకా
అనేటట్టుగా ఇది నీ మాయేనా

పదము నాది పరువు నీది
రధమువై రా ప్రియతమా
తగువు నాది తెగువ నీది
గెలుచుకో పురుషోత్తమా
నువ్వే దారిగా నిన్నే చేరగా
ఎటూ చూడకా వెనువెంటే రానా

No comments:

Post a Comment