Movie: Appu chesi pappu kudu Music: S Rajeswara Rao Lyricist: Pingali
Singers: P Leela, Ghantasala Pictured on: Savitri, N.T.Rama Rao Director: L.V.Prasad
ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి
ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ
ప్రకృతినెల్ల హాయిగా.... ఆ.... ప్రకృతినెల్ల హాయిగా
తీయగా మాయగా పరవశింప జేయుచూ
ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి
జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ
జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ
మనసు మీద హాయిగా.... ఆ.... మనసు మీద హాయిగా
తీయగా మాయగా మత్తు మందు జల్లుతూ
ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి
హృదయ వీణ మీటుతూ ప్రేమ గీతి పాడుతూ
హృదయ వీణ మీటుతూ ప్రేమ గీతి పాడుతూ
ప్రకృతినెల్ల హాయిగా.... ఆ.... ప్రకృతినెల్ల హాయిగా
తీయగా మాయగా పరవశింప జేయుచూ
ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి ఈ చల్లని గాలి
A very lilting, sweet song that transports the listener into a celestial realm.
ReplyDelete