Movie: Seetamma vakitlo
Sirimalle Chettu Music: Vicky J Meyer Lyrics: Sirivennela Seetarama Sastri
Singers: Ranjith, Sri Ram Chandra, Karthik Director: Srikanth Addala
ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో
జరిగినట్టు
కిం కర్తవ్యం అని కలవరపడడం
కొందరి తరహా
అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగ
దాటుకుంటూ
వాటంగా దూసుకుపొతే మేలని కొందరి
సలహా
ఏదో తలవడం వేరే జరగడం సర్లే
అనడమే వేదాంతం
దేన్నొ వెతకడం ఎన్నో అడగటం
ఎపుడూ తెమలని రాద్ధాంతం
ఏం చేద్దాం అనుకుంటె మాత్రం
ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం మునుముందేముందో
తెలియని చిత్రం
ఏమౌతాం మననెవరడిగారని ఏమని
అంటాం
ఏం విందాం తర తరికిట తక తక
ధూం ధూం తక ధూం
ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో
జరిగినట్టు
కిం కర్తవ్యం అని కలవరపడడం
కొందరి తరహా
అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగ
దాటుకుంటూ
వాటంగా దూసుకుపొతే మేలని కొందరి
సలహా
ఫాలో పదుగురి బాటా బోలో నలుగురి
మాటా
లోలో కలవరపాటా దాంతో గడవదు
పూటా
ఇటా అటా అని ప్రతొక్క దారిని
నిలేసి అడగకు సహోదరా
ఇదే ఇదే అని ప్రమాణ పూర్తిగ
తెగేసి చెప్పేదెలాగరా
ఇది గ్రహించినారీ మహాజనం ప్రయాశ
పడి ఏం ప్రయోజనం
సిమెంట్ భూతల సహార దారిది
నిలవడం కుదరదే కదలరా
ఏం చేద్దాం అనుకుంటె మాత్రం
ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం మునుముందేముందో
తెలియని చిత్రం
ఏమౌతాం మననెవరడిగారని ఏమని
అంటాం
ఏం విందాం తర తరికిట తక తక
ధూం ధూం తక ధూం
ఎన్నో పనులను చేస్తాం..ఏవో
పరుగులు తీస్తాం
సతమతమవుతాం
ఓహో బతుకిదే అంటాం
అడంగు తెలియని ప్రయాణమే యుగ
యుగాలుగ మన అయోమయం
వెనక్కు తిరగని ప్రవాహమే యేతుఫాను
తరిమిన ప్రతీక్షణం
ఇది పుటుక్కు జర జర డుబుక్కు
మే అడక్కు అది ఒక రహస్యమే
ఫలాన బదులని తెలీని ప్రశ్నలు
అడగటం అలగడం తగదు గా
ఏం చేద్దాం అనుకుంటె మాత్రం
ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం మునుముందేముందో
తెలియని చిత్రం
ఏమౌతాం మననెవరడిగారని ఏమని
అంటాం
ఏం విందాం తర తరికిట తక తక
ధూం ధూం తక ధూం
ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో
జరిగినట్టు
కిం కర్తవ్యం అని కలవరపడడం
కొందరి తరహా
అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగ
దాటుకుంటూ
వాటంగా దూసుకుపొతే మేలని కొందరి
సలహా
Nice Song lyrics in Telugu
ReplyDeletePodichestam aa pani chestam aa
ReplyDeleteYem avtam aa yem andaam aa
Sahara daridi aa saharedari idi aa