Sunday, January 27, 2013

rama kanavemira swathi mutyam telugu song lyrics in telugu font



Movie: Swathimutyam Music: Ilayaraja 
Lyrics: Sirivennela Seeta Rama Sastry   
Singers: S P Balasubramanyam, S. Janaki
Director: K.Viswanath

రామా కనవేమిరా
రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా
రామా కనవేమిరా
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమ గాత్రి
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా
సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని
సభాసదులందరు పదే పదే చూడగా శ్రీ రామ చంద్ర మూర్తి
కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు

ముసిముసి నగవుల రసిక శిఖామణులు
ఒసపరి చూపుల అసదుష విక్రములు సగరిద మని ద మ ని ని
ముసిముసి నగవుల రసిక శిఖామణులు థ థకిట థక జణుత
ఒసపరి చూపుల అసదుష విక్రములు
థకజణు థకధిమి థక
మీసం మీటే రోష పరాయణులు నీ ద మ ప మ స రి గ
మా సరి ఎవరను మత్త గుణొల్వణులూ ఆహ
క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై
తరుణి వంక శివ ధనువు వంక
తమ తనువు మరచి కనులు తెరచి చూడగ
రామా కనవేమిరా

ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు భూవరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు
గుండెలు జారిన విభులు
విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నరకుండవులు
తమ వళ్ళు వొరిగి రెండు కళ్ళు తిరిగి వొగ్గెసిన పురుషాగ్రణులు
ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అహ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అహ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
తకద్ తైయ్యకు తా దిమి తా..

రామాయ రామభద్రాయ రామచంద్రాయ నమహ
అంతలొ రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
అంతలొ రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
సీత వంక ఓరకంట చూసినాడు
సీత వంక ఓరకంట చూసినాడు
ఒక్క చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు
చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు
ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ విరిగెను శివ ధనువు
కళలొలికెను సీతా నవ వధువు
జయ జయ రామ రఘుకుల సోమ
జయ జయ రామ రఘుకుల సోమ
దశరధ రామ దైత్యవి రామ
దశరధ రామ దైత్యవి రామ

సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే
సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే
కనగ కనగ కమనీయమె అనగ అనగ రమణీయమె
కనగ కనగ కమనీయమె అనగ అనగ రమణీయమె
సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే
రామయ్య అదుగోనయ్య
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా

1 comment:

  1. this is written by C.Narayana Reddy
    https://en.wikipedia.org/wiki/Swati_Mutyam

    ReplyDelete