Movie: Seetamma vakitlo
Sirimalle Chettu Music: Vicky J Meyer Lyrics: Sirivennela Seetarama Sastri
Singer: Sriram Chandra Director: Srikanth Addala
మరీ అంతగా మహా చింతగా మొహం
ముడుచుకోకలా
పనేం తోచకా పరేషానుగా గడబిడ
పడకు అలా
మతోయెంతగా శ్రుతే పెంచగా విచారాల
విల విలా
సరే చాలికా అలా జాలిగా తిక
మక పెడితే ఎలా?
కన్నీరై కురవాలా మన చుట్టూ
ఉండే లోకం తడిసేలా?
ముస్తాబే చెదరాలా నిను చూడాలంటె
అద్దం జడిసేలా?
ఎక్కిళ్ళె పెట్టి ఏడుస్తుంటె
కష్టం పోతుందా? కదా? మరెందుకు గోలా?
అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం
వస్తుందా? వ్రుధా ప్రయాస పడాలా?
మరీ అంతగా మహా చింతగా మొహం
ముడుచుకోకలా
సరే చాలికా అలా జాలిగా తిక
మక పెడితే ఎలా?
ఎండలను దండిస్తామా? వానలను
నిందిస్తామా? చలినెటో తరిమేస్తామా ఛీ పొమ్మనీ?
కస్సుమనీ కలహిస్తామా? ఉస్సురని
విలపిస్తామా? రోజులతో రాజీ పడమా సర్లెమ్మని?
సాటి మనుషులతో మాత్రం సాగనని
ఎందుకు పంతం?
పూటకొక పేచీ పడుతూ ఏం సాధిస్తామంటె
ఏం చెబుతాం?
ఎక్కిళ్ళె పెట్టి ఏడుస్తుంటె
కష్టం పోతుందా? కదా? మరెందుకు గోలా?
అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం
వస్తుందా? వ్రుధా ప్రయాస పడాలా?
చమటలేం చిందించాలా? శ్రమపడేం
పండించాలా?
పెదవిపై చిగురించేలా చిరునవ్వులు
కండలను కరిగించాలా? కొండలను
కదిలించాలా? చచ్చి చెడి సాధించాల సుఖ శాంతులు
మనుషులనిపించే రుజువు
మమతలను పెంచే ఱుతువు
మనసులను తెరిచే హితవు
వందేళ్ళయినా వాడని చిరునవ్వు
ఎక్కిళ్ళె పెట్టి ఏడుస్తుంటె
కష్టం పోతుందా? కదా? మరెందుకు గోలా?
అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం
వస్తుందా? వ్రుధా ప్రయాస పడాలా?
very great
ReplyDelete