Sunday, January 20, 2013

meghallo telug song lyrics in telugu script seetamma vakitlo sirimalle chettu lyrics



Movie: Seetamma vakitlo Sirimalle Chettu Music: Vicky J Meyer Lyrics: Sirivennela Seetarama Sastri Singers: Sri Ram Chandra, Karthik Director: Srikanth Addala

మేఘాల్లొ సన్నాయి రాగం మోగింది
మేళాలు తాళాలు వినరండి
సిరికీ శ్రీహరికీ కల్యాణం కానుంది
శ్రీరస్తు శుభమస్తు అనరండి
అచ్చ తెలుగింట్లొ పెళ్ళికి అర్ధం చెప్తారంటు
మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటు
జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి


అందాల కుందనపు బొమ్మవని
జత చేరుకున్న ఆ చందురుని
వందేళ్ళ బంధమై అల్లుకుని
చెయ్యందుకోవటే ఓరమణీ

ఇంతవరకెన్నో చూసాం అనుకుంటె సరిపోదుగా
ఎంత బరువంటే మోసే దాకా తెలియదుగా
ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా
కాస్తైనా కంగారు ఉంటుందిగా
నీకైతే సహజం తీయని బరువై సొగసించె బిడియం
పనులెన్నో పెట్టి మా తలలూ వంచిందే ఈసమయం
మగాళ్ళమైనా ఏం చేస్తాం సంతోషంగా మోస్తాం
ఘన విజయం పొందాకే తీరిగ్గా గర్విస్తాం

అందాల కుందనపు బొమ్మవని
జత చేరుకున్న ఆ చందురుని
వందేళ్ళ బంధమై అల్లుకుని
చెయ్యందుకోవటే ఓరమణీ


రామ చిలకలతో చెప్పి రాయించామే పత్రికా
రాజ హంసలతో పంపి ఆహ్వానించాంగా
కుదురుగా నిమిషం కూడ నిలబడలేమే బొత్తిగా
యే మాత్రం యే చోట రాజీ పడలేకా
చుట్టాలందరికి అనందంతొ కళ్ళు చెమర్చేలా
గిట్టని వాళ్ళైన ఆశ్చర్యంతో కనులను విచ్చేలా
కలల్లోనైనా కన్నామా కథలైనా విన్నామా
ఈ వైభోగం అపురూపం అనుకుంటారమ్మా

అందాల కుందనపు బొమ్మవని
జత చేరుకున్న ఆ చందురుని
వందేళ్ళ బంధమై అల్లుకుని
చెయ్యందుకోవటే ఓరమణీ

No comments:

Post a Comment