Movie: Sirivennela Music: KV
Mahadevan Lyrics: Sirivennela Seetarama Sastri Singer: SP Balasubramanya
Director: K. Viswanath
విధాత తలపున ప్రభవించినదీ
అనాది జీవన వేదం
ఓం...
ప్రాణనాడులకు స్పందననొసగిన
ఆది ప్రణవనాదం
ఓం...
కనుల కొలనులో ప్రతిబింబించిన
విశ్వరూప విన్యాసం
యెద కనుమలలో ప్రతిధ్వనించిన
విరించి విపంచి గానం
ఆ...
సరసస్వర సుర ఝరీగమనమౌ
సామవేద సారమిది
సరసస్వర సుర ఝరీగమనమౌ
సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ
కవనం
విపంచినై వినిపించితిని ఈ
గీతం
ప్రాగ్దిశ వేణియ పైనా
దినకర మయూఘ తంత్రుల పైనా
జాగ్రుత విహంగ తతులే
వినీల గగనపు వేదిక పైనా
ప్రాగ్దిశ వేణియ పైనా
దినకర మయూఘ తంత్రుల పైనా
జాగ్రుత విహంగ తతులే
వినీల గగనపు వేదిక పైనా
పలికిన కిలకిల ధ్వనముల స్వరగతి
జగతికి శ్రీకారము కాదా
విశ్వకార్యమునకిది భాష్యము
గా..
విరించినై...
జనించు ప్రతి శిశు గళమున పలికిన
జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు
హ్రుదయ మ్రుదంగధ్వానం
జనించు ప్రతి శిశు గళమున పలికిన
జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు
హ్రుదయ మ్రుదంగధ్వానం
అనాదిరాగం ఆదితాళమున
అనంత జీవన వాహినిగా
సాగిన స్రుష్టి విలాసమునీ
విరించినై...
నా వుచ్చ్వాసం కవనం
నా నిశ్వాసం గానం
నా వుచ్చ్వాసం కవనం
నా నిశ్వాసం గానం
సరసస్వర సుర ఝరీగమనమౌ
సామవేద సారమిదీ
నే పాడిన జీవన గీతం ఈ గీతం
కొన్ని అక్షర దోషాలు సవరణ కొరకు: జాగృత, హృదయ, సృస్టి, మృదంగ
ReplyDeleteGrt song
ReplyDelete