Movie: Mayabazar Music: Ghantasala
Lyrics: Pingali Singer: Ghantasala, Leela Director: K. V. Reddy
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే
ఊగెనుగ.. ఊగెనుగ.. తూగెనుగ..
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే
ఊగెనుగ.. ఊగెనుగ.. తూగెనుగ.. ఆ..ఆ..ఆ..ఆ..
తారా చంద్రుల విలాసములతో.. విరిసే
వెన్నెల పరవడిలో ఉరవడిలో..
తారా చంద్రుల విలాసములతో.. విరిసే
వెన్నెల పరవడిలో
పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల
లాలనలో || లాహిరి లాహిరి ||
అలల ఊపులో తీయని తలపులూ... చెలరేగే
ఈ కలకలలో... మిలమిలలో...
అలల ఊపులో తీయని తలపులూ... చెలరేగే
ఈ కలకలలో
మైమరపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరణలో || లాహిరి లాహిరి ||
రసమయ జగమును రాసక్రీడకు ఉసిగొలిపే
ఈ మధురిమలో.. మధురిమలో..
ఎల్లరిమనములు ఝల్లన జేసే చల్లని
దేవుని అల్లరిలో || లాహిరి లాహిరి ||
So short, but so sweet. Hats off to Pingali Nagendra (lyricist), Ghantasala and Leela (singers), Ghantasala again (as music director), and KV Reddy (director), not to forget BN Reddy and A Chakrapani (producers) and the team.
ReplyDeleteWhat about Marcus burtly cameraman a specialist in moonlight scenes?
Deleteపూలవలపుతో ఘమ ఘుమ లాడే పిల్ల వాయువుల లాలనలో
ReplyDeleteమాహిరే మాహిరే
Super lyrics
ReplyDeleteSend mayabazar song laahirilaahiri full n
ReplyDeleteMayabazar song fullnotes
ReplyDeleteSuper song every green
ReplyDeleteCan you please tell me the meaning of this song
ReplyDelete