Wednesday, January 23, 2013

sirivennela adi bhikshuvu telugu song lyrics in telugu font

Movie: Sirivennela Music: KV Mahadevan Lyrics: Sirivennela Seetarama Sastri Singer: SP Balasubramanyam Director: K. Viswanath

ఆదిభిక్షువు వాడినేది కోరేదీ? బూడిదిచ్చేవాడినేది అడిగేదీ?
ఆదిభిక్షువు వాడినేది కోరేదీ? బూడిదిచ్చేవాడినేది అడిగేదీ?
ఏది కోరేదీ? వాడినేది అడిగేదీ?ఏది కోరేదీ? వాడినేది అడిగేదీ?

తీపిరాగాల ఆకోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేదీ?
తీపిరాగాల ఆకోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేదీ?
కరకు ఘర్ఝనల మేఘములమేనికి మెరుపుహంగు కూర్చినవాడినేది అడిగేదీ?
ఏది కోరేదీ? వాడినేది అడిగేదీ?ఏది కోరేదీ? వాడినేది అడిగేదీ?

తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేదీ?
తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేదీ?
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేదీ?
ఏది కోరేదీ? వాడినేది అడిగేదీ?ఏది కోరేదీ? వాడినేది అడిగేదీ?

గిరిబాలతో తనకుకల్యాణమొనరింప దరిజేరు మన్మధుని మసిచేశినాడు..
వాడినేది కోరేదీ?
వరగర్వమున మూడులోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేదీ?
ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు..వాడినేది కోరేదీ?
ముక్కంటి... ముక్కోపి... ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు

ఆదిభిక్షువు వాడినేది కోరేదీ? బూడిదిచ్చేవాడినేది అడిగేదీ?
ఏది కోరేదీ? వాడినేది అడిగేదీ?

No comments:

Post a Comment