Movie: Missamma, Lyrics: Pingali, Pictured on: N.T.R,
Savitri, Music: S. Rajeswara Rao Director: L.V.Prasad Singers: P Leela, AM
Raja
అతడు: రావోయి చందమామ, మా వింత గాధ వినుమా రావోయి చందమామ
సామంతముగల సతికీ ధీమంతుడనగు పతినోయ్
సామంతముగల సతికీ ధీమంతుడనగు పతినోయ్
సతిపతి పోరే ఫలమై సతమతమాయెను బ్రతుకే
ఆమె: రావోయి చందమామ, మా వింత గాధ వినుమా రావోయి చందమామ
ప్రతినలు పలికిన పతితో బ్రతుగక వచ్చిన సతినోయ్
ప్రతినలు పలికిన పతితో బ్రతుగక వచ్చిన సతినోయ్
మాటలు బూటకమాయె నటనలు నేర్చెను చాలా
అతడు: తన
మతమెదో తనదీ మనమతమసలే పడదోయ్
తన మతమెదో తనదీ మనమతమసలే పడదోయ్
మనమూ మనదను మాటే అననీయదు తాననదోయ్
ఆమె: నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేవొయ్
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేవొయ్
ఈ విధి కాపురమెటులో నీవొక కంటిన గనుమా
ఇద్దరు: రావోయి చందమామ, మా వింత గాధ వినుమా రావోయి చందమామ
Very nice in Telugu
ReplyDeleteVery nice in Telugu
ReplyDelete