Movie: Seetamma vakitlo
Sirimalle Chettu Music: Vicky J Meyer Lyrics: Anant Sriram Singer: Chitra
Director: Srikanth Addala
ఏకువలొనా గోదారీ ఎరుపెక్కిందీ
ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది
...
ఏకువలొనా గోదారీ ఎరుపెక్కిందీ
ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది
...
పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి
అహ సిగ్గంతా చీరకట్టింది
చీరలో చందమామ ఎవరమ్మ
ఆ గుమ్మ సీతమ్మ
సీతమ్మా వాకిట్లొ సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు
కోసినవన్ని సీత కొప్పు చుట్టండి
కొప్పున పూలు గుప్పెడంత ఎందుకండి
కోదండ రామయ్య వస్తున్నాడండి
రానే వచ్చాడోయమ్మ ఆ రామయ్య
వస్తూ చేసాడమ్మా ఏదొ మాయా ...
రానే వచ్చాడోయమ్మ ఆ రామయ్య
వస్తూ చేసాడమ్మా ఏదొ మాయా ...
సీతకీ రాముడే సొంతమయ్యె చోటిదీ
నేలతొ ఆకసం వియ్యమందే వేళిదీ
మూడు ముళ్ళు వేస్తె మూడు లోకాలకి
ముచ్చటొచ్చేనమ్మా
ఏడు అడుగులేస్తె ఏడు జన్మలకి వీడదీసిందమ్మా
సీతమ్మ వాకిట్లొ సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టుపై చిలకా వాలింది
చిలకమ్మ ముద్దుగ చెప్పిందో మాట
ఆ మాట విన్నావా రామ అంటుంది
రామ రామ అన్నాది ఆ సీత గుండే
అన్న నాడె ఆమెకి మొగుడయ్యాడె
చేతిలొ చేతులే చేరుకుంటె సంబరం
చూపులో చూపులే లీనమైతె సుందరం
జంట బాగుందంటు గొంతు విప్పాయంట
చుట్టు చెట్టు చేమ
పంట పండిందంటు పొంగి పోయిందమ్మ
ఇదిగొ ఈ సీతమ్మ
No comments:
Post a Comment