Friday, January 18, 2013

Maharshi telugu song lyrics in telugu font mata rani mounamidi



Movie: Maharshi Music: Ilayaraja Lyrics: Veturi Singer: SP Balasubramanyam Director: Vamsee

మాట రాని మౌనమిది
మౌన వీణ గానమిది
మాట రాని మౌనమిది
మౌన వీణ గానమిది
గానం ఇదీ నీ ధ్యానం ఇదీ
ధ్యానములో నా ప్రాణమిదీ
ప్రాణమైన మూగ గుండె రాగమిదీ

మాట...

ముత్యాల పాటల్లొ కోయిలమ్మా
ముద్దారబోసెది ఎప్పుడమ్మా
ఆ పాల నవ్వులో వెన్నెలమ్మా
దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
ఈ మౌన రాగాలా ప్రేమావేశం
యేనాడో ఒకరి సొంతం
ఆకాశ దీపాలు జాబిలి కోసం
నీకేలా ఇంత పంతం
నింగీ నేలా కూడే వేళ
నీకూ నాకూ దూరాలేలా
అందరాని కొమ్మ ఇదీ
కొమ్మ చాటు అందమిదీ

మాట...

చైత్రాన కూశేను కోయిలమ్మా
ఘ్రీష్మానికా పాట యెందుకమ్మా?
రేయంత నవ్వేను వెన్నెలమ్మా
నీరెండకానవ్వు దేనికమ్మా?
రాగలా తీగల్లో వీణా నాదం
కోరిందీప్రణయ వేదం
వేసారూ గుండెల్లొ రేగే గాయం
పాడిందీ మధుర గేయం
ఆకాశాన తారా తీరం
అంతేలేని ఎంతో దూరం

మాట రాని మౌనమిదీ
మౌన వీణ గానమిదీ
అందరాని కొమ్మ ఇదీ
కొమ్మ చాటు అందమిదీ
కూడనిది జత కూడనిదీ
చూడనిదీ మది పాడనిదీ
చెప్పరాని చిక్కుముడి వీడనిదీ

మాట...

No comments:

Post a Comment