Movie: Swathimutyam Music: Ilayaraja
Lyrics: Dr. C.Narayana Reddy Singers: S.
Janaki, Director: K.Viswanath
లాలి..లాలి..లాలి..లలి
లాలి..లాలి..లాలి..లలి
వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి
వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి
మురిపాల క్రిష్నునికి ఆ..ఆ..ఆ
మురిపాల క్రిష్నునికి ముత్యాల లాలి
జగమేలు స్వామికి పగడాల లాలి
వటపత్ర||
లాలి||
కల్యాణ రామునికి కౌశల్య లాలి
కల్యాణ రామునికి కౌశల్య లాలి
యదు వంశ విభునికి యశోద లాలి
యదు వంశ విభునికి యశోద లాలి
కరి రాజ ముఖునికి
కరి రాజ ముఖునికి గిరి తనయ లాలి
కరి రాజ ముఖునికి గిరి తనయ లాలి
పరమాంశ భవనుకి పరమాత్మ లాలి
వటపత్ర||
లాలి||
జో..జో..జో..జో..జో
జో..జో..జో..జో..జో
అలమేలుపతికి అనమయ్య లాలి
అలమేలుపతికి అనమయ్య లాలి
కోదండ రామునికి గోపయ్య లాలి
కోదండ రామునికి గోపయ్య లాలి
శ్యామలాంగునికి శ్యామయ్య లాలి
శ్యామలాంగునికి శ్యామయ్య లాలి
ఆగమనుతునికి త్యాగయ్య లాలి
వటపత్ర||
లాలి||
వటపత్ర "సాయి" కాదు శాయి
ReplyDelete