Friday, February 8, 2013

Chakram telugu movie songs in telugu script jagamantha kutumbam naadi



Movie: Chakram Music: Chakri Lyrics: Sirivennela Seetarama Sastri Singer: Sri Director: Krishna Vamsee

జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాలొ కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తు నాతో నేనె రమిస్తూ

వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని
రంగుల్నీ రంగవల్లులనీ కావ్య కన్యల్ని ఆడ పిల్లలని
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిసినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని

జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె

నా హ్రుదయమే నా లోగిలి
నా హ్రుదయమే నా పాటకి తల్లి
నా హ్రుదయమే నాకు ఆలి
నా హ్రుదయములో ఇది సినీవాలి
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

Thursday, January 31, 2013

Kotha Bangaru Lokam telugu song lyrics in telugu font ok anesa



Movie: Kotha Bangaru Lokam Music: Micky J Meyer Lyrics: Sirivennela Seetarama Sastri Singer: Naresh Iyer, Kalyani Director: Srikanth Addala

ఓకే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేసా నాకెందుకులే రభసా
భారమంతా నేను మోస్తా
అల్లుకోవా ఆశాలతా
చేరదీస్తా సేవచేస్తా రాణిలా చూస్తా
అందుకేగా గుండెలో నీ పేరు రాసా
తెలివనుకో తెగువనుకో మగజన్మ కదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా

పరిగెడదాం పదవే చెలి ….. ఎందాక అన్నానా
కనిబెడదాం తుది మజిలీ. ఎక్కడున్నాం
ఎగిరెడదాం ఇలనొదిలీ. నిన్నాగమన్నానా
గెలవగలం గగనాన్ని. ఎవరాపినా
మరోసారి అను ఆమాట మహారాజునైపోతాగా
ప్రతి నిమిషం నీకొసం ప్రాణం సైతం పందెం వేసేస్తా
ఆ తరుణమొ కొత్తవరమొ జన్మ ముడి వేసిందిరా
చిలిపితనమో చెలిమిగుణమో ఏమిటీ లీలా
స్వప్నలోకం ఏలుకుందాం రాగమాల
అదిగదిగో మదికెదురై కనబడలెదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా

పిలిచినదా చిలిపికలా .. వింటూనే వచ్చేసా
తరిమినిదా చెలియనిలా తలుపు తీసా
వదిలినదా బిడియమిలా.. ప్రశ్నల్ని చెరిపేసా
ఎదురవదా చిక్కువలా ఎటో చూసా
భలేగుందిలే నీ ధీమా ఫలిస్తుందిలే ఈప్రేమా
అదరకుమా బెదరకుమా త్వరగా విడిగా సరదా పడదామా
పక్కనుంటూ ఫక్కుమంటూ నవ్వినాడా ప్రియతమా
చిక్కులుంటే బిక్కుమంటూ లెక్క చేస్తావా
చుక్కలన్నీ చిన్నబోవా చక్కనమ్మా
మమతనుకో మగతనుకో మతి చెడిపోదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా

Wednesday, January 30, 2013

Kotha Bangaru Lolkam telugu song lyrics in telugu font nenanee neevanee



Movie: Kotha Bangaru Lokam Music: Micky J Meyer Lyrics: Sirivennela Seetarama Sastri Singer: Swetha Pandit Director: Srikanth Addala

నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ
ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్ప వెనకాలా స్వప్నం
ఎప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలరా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే

మొదటి సారి మదిని చేరి
నిదర లేపిన ఉదయమా
వయసులోని పసితనాన్ని
పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా మరో పుట్టుకా
అనేటట్టుగా ఇది నీ మాయేనా

పదము నాది పరువు నీది
రధమువై రా ప్రియతమా
తగువు నాది తెగువ నీది
గెలుచుకో పురుషోత్తమా
నువ్వే దారిగా నిన్నే చేరగా
ఎటూ చూడకా వెనువెంటే రానా

kotha bangaru lokam telug song lyrics in telugu font nee prasnalu




Movie: Kotha Bangaru Lokam Music: Micky J Meyer Lyrics: Sirivennela Seetarama Sastri Singer: SP Balasubramanyam Director: Srikanth Addala

 


నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కననూ అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిశే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక వుంటుందా
బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిముషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా

అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతి తోచని గమనానికి గమ్యం అంటూ వుందా
వలపేదో వల వేస్తుంది వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే యేదొ ఇంతవరకు వివరించే రుజువేముంది
సుడిలో పడు ప్రతి నావా చెబుతున్నది వినలేవా

పొరబాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా
మనకోసమె తనలొ తను రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెబుతుందా
కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని
అని తిరగేసాయా చరిత పుటలు వెనుచూడక వురికే జతలు
తమ ముందు తరాలకు స్మ్రుతుల చితులు అందించాలా ప్రేమికులు
ఇది కాదే విధి రాతా అనుకోటం ఎదురీతా

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కననూ అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిశే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక వుంటుందా